Somu Veerraju Appointed as AP BJP President: బీజేపీ కొత్త చీఫ్ నియామకం పై కన్నా ఆసక్తికరమైన ట్వీట్

Somu Veerraju Appointed as AP BJP President: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎంపిక చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు కన్నా

Krishna
Published on: 28 July 2020 2:45 PM IST
Somu Veerraju Appointed as AP BJP President: బీజేపీ కొత్త చీఫ్ నియామకం పై కన్నా ఆసక్తికరమైన ట్వీట్
X
kanna lakshminarayana, somu veerraju (File Photo)

Somu Veerraju Appointed as AP BJP President: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎంపిక చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణను ఆ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో సోమువీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటనను విడుదలచేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోమువీర్రాజు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

ఆయితే దీనిపైన కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా నియమించబడిన ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు'అంటూ అయన ట్వీట్ చేశారు. పరోక్షంగా సోము నియామకాన్ని కన్నా స్వాగతించారు. ఇక కన్నా లక్ష్మీనారాయణకి పార్టీలో మరో పదవి ఇవ్వనున్నారన్న చర్చ నడుస్తోంది.



కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీ అధిష్టానం అయనకు 2018లో అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. అయితే అయన నాయకత్వంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది.

ఇక ఇది ఇలా ఉంటే తనని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమిచడం పట్ల సోము వీర్రాజు స్పందించారు. ఇది ఓ కార్యకర్తకు దక్కిన అవకాశం అని అయన అన్నారు. ఏపీలో బిజేపీని బలోపేతం చేస్తానని, జనసేనతో కలిసి పార్టీ పటిష్టతకు కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళతామని అన్నారు. ఇక కన్నా లక్ష్మీనారాయణతో పాటు బిజేపీ సీనియర్ నేతలను కలుపుకుని ముందుకు వెళతానని ఆయన స్పష్టం చేశారు.

Krishna

Krishna

Next Story