Sajjala: యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకున్నారేమో.. చంద్రబాబు ఏం చెబితే పవన్ అది చేస్తారు..
Sajjala: తాను వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు.
Sajjala: యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకున్నారేమో.. చంద్రబాబు ఏం చెబితే పవన్ అది చేస్తారు..
Sajjala: తాను వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. యార్లగడ్డను ఎక్కడైనా సర్ధుబాటు చేస్తామని సజ్జల ప్రకటిస్తే బాగుండేదన్నారు. ఉంటే.. ఉండు, పోతే పొమ్మని.. సజ్జల చెప్పడం తనకు బాధ కలిగించిందన్నారు యార్లగడ్డ. ఇక యార్లగడ్డ మాటలకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటరిచ్చారు. సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలి కానీ..బహిరంగ వేదికలపై విమర్శలు తగవన్నారు. యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తోందని సజ్జల ఆరోపించారు.
ఇక.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఏం చెబితే పవన్ అది చేస్తారని సజ్జల ఆరోపించారు. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యమని ఇప్పటికే పవన్ చాలా సార్లు చెప్పారని, దాని కోసం పవన్ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. చంద్రబాబు డిసైడ్ చేస్తారు.. పవన్ ఫాలో అవుతారని విమర్శనాస్త్రాలు సంధించారు సజ్జల.