Sunnipenta: నాణ్యత గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు అధికారులు!

Sunnipenta: సున్నిపెంటలో రోడ్ల నిర్మాణం పేరిట ప్రజాధనం దుర్వినియోగం. నాణ్యత లేని సిమెంట్ పనులు, అధికారుల పర్యవేక్షణ లోపంపై స్థానికుల ఆగ్రహం.

Update: 2026-03-24 08:04 GMT

Sunnipenta: నాణ్యత గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు అధికారులు!

Sunnipenta: సుండిపెంట గ్రామంలోప్రజాధనం అంటే అధికారులకు పాలకులకు, కాంట్రాక్టర్లకు ఎంత లోకువో సున్నిపెంటలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులే సాక్ష్యం. ఏళ్ల తరబడి మన్నికగా ఉండాల్సిన రోడ్లు, కేవలం ఒక్క వానాకాలం కూడా తట్టుకోలేనంత దారుణంగా తయారవుతున్నాయి. పూర్ణానంద ఆశ్రమం, అక్కమ్మ సెంటర్, స్టోర్ సెంటర్, నుండి ఫిల్టర్ హౌస్ వరకు మరియు చాపల మార్కెట్, సులేమాన్ సెంటర్, బండ్ల బజార్ నుండి కాల్ సెంటర్ వరకు వేస్తున్న సిమెంట్ రోడ్డు పనుల్లో జరుగుతున్న అక్రమాలు చూస్తుంటే.. ఇది రోడ్డు నిర్మాణమా లేక అవినీతి అడ్డానా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు అవినీతి సైగలు మీడియాను చూసి పనులు ఆపేయమంటూ అధికారికాంట్రాక్టర్ మట్టి తీసేందుకు పారలు లేవా జెసిబితోనే కానిచ్చేస్తారా.

​జనానికి అష్టదిగ్బంధం రాకపోకలు బంద్ నాణ్యత లేని పనులతో ప్రజల ప్రాణాలతో చెలగాటం​నిర్మాణ నిబంధనల ప్రకారం ఉండాల్సిన సిమెంటు, ఇసుక పాలు ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు. కేవలం కంకరను నీళ్లతో కలిపి రోడ్డుపై పారబోస్తూ 'కాకి' స్నానం చేయిస్తున్నారు. కాంక్రీట్ మిక్సింగ్ పర్యవేక్షించాల్సిన పంచాయతీరాజ్ అధికారులు ఆ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. కేవలం కాంట్రాక్టరుతో కుమ్మక్కై, నాణ్యతను పాతాళానికి తొక్కి బిల్లులు మంజూరు చేయించుకోవడమే లక్ష్యంగా పనులు సాగిస్తున్నారు.

Tags:    

Similar News