Kurnool: గ్యాస్ సెగ ఖాళీ సిలిండర్లతో వినియోగదారుల రోడ్డు దిగ్బంధం!
Kurnool: పత్తికొండలో భారత్ గ్యాస్ వినియోగదారుల భారీ ధర్నా. ఖాళీ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించిన పట్టణవాసులు. గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది అక్రమ దందాలపై ఆగ్రహం.
Kurnool: గ్యాస్ సెగ ఖాళీ సిలిండర్లతో వినియోగదారుల రోడ్డు దిగ్బంధం!
పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో భారత్ గ్యాస్ వినియోగదారులు రోడ్డెక్కారు. గత కొద్ది రోజులుగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన తీవ్ర కొరతను నిరసిస్తూ, ఖాళీ సిలిండర్లతో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వినియోగదారుల ఆందోళనతో వాహనాలు నిలిచిపోయి, పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని పట్టణవాసులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సామాన్య వినియోగదారులకు "స్టాక్ లేదు" అని చెబుతూ, అదే సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని నిరసనకారులు మండిపడ్డారు. బుకింగ్ చేసుకున్న వారాలకు కూడా గ్యాస్ డెలివరీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.