Sajjala: చంద్రబాబు హయాంలో జరిగిన అతిపెద్ద స్కామ్ అమరావతి
Sajjala: అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు
Sajjala: చంద్రబాబు హయాంలో జరిగిన అతిపెద్ద స్కామ్ అమరావతి
Sajjala: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెనుకబడిన వర్గాల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లెఫ్ట్ పార్టీలు సంపన్నుల వైపు నిలబడతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంట్‌లా పవన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని అన్నారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు..రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం జగన్ పాలన ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారున్నారు.
చంద్రబాబు హయాంలో జరిగిన దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి అన్నారు. లింగమనేని రమేష్‌కి, హెరిటేజ్‌కి మధ్య లావాదేవీలు జరిగాయి. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు. డబ్బున్న వాళ్లకోసం పేదలకు ఇవ్వకుండా చేశారు. రియల్‌ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు.' అని సజ్జల ఫైర్ అయ్యారు.