ప్రకాశం జిల్లాలో ఘోరం.. కరెంట్ షాక్ తో 9 మంది మృతి
ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో పెద్ద ప్రమాదం సంభవించింది.
ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. కరెంట్ షాక్ తగలడంతో పలువురు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలోని మాచవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరెంటు తీగలు తెగి కూలీలపై పడడంతో షాక్ తగిలి మృతిచెందినట్టుగా సమాచారం.
వీరంతా సమీపంలోని మిరప తోటలో మిరపకాయలు కోసి ఇంటికి తిరిగి వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో దాదాపు 30 మంది కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోయారు, పలువురు గాయపడడంతో వారిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ గుర్తించిన మృతుల వివరాలు ఇలా ఉన్నాయి..
1.పీకా కొటేశ్వరమ్మ(50),
2.నుకతోటి లక్ష్మే(65),
3.కాకుమాను రమాదేవి(55),
4.కాకుమాను కుమారి(45),
5.కాకుమాను రాణిశ్రీ(40),
6.గోళ్ళ రవి శంకర్(20),
7.కాకుమాను శివ(17)
8.కాకుమాను మౌనిక(18)
9.కాకుమాను అమూల్య18)