రెడ్‌జోన్‌లో ఆంక్షలు కఠినతరం .. ఇంటింటికీ మాస్కుల పంపిణీ

పిఠాపురం: పిఠాపురం పట్టణం రెడ్‌జోన్‌లో వున్న నేపథ్యంలో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు.

Update: 2020-04-21 05:01 GMT
Masks Distribution

పిఠాపురం: పిఠాపురం పట్టణం రెడ్‌జోన్‌లో వున్న నేపథ్యంలో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. తారకరామానగర్‌, సాలిపేట, శెట్టిబలిజ పేట, వైఎస్‌ఆర్‌ గార్డెన్‌, బొజ్జావారి తోట ప్రాంతాలను ఇప్పటికే రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో ఉదయం ఆరు గంట నుంచి ఉదయం 9 గంటల వరకూ మాత్రమే అత్యవసరాల నిమిత్తం ఇంటికి ఒకరికి అనుమతి ఇచ్చారు. ఎక్కడిక్కడ వీధున్నింటినీ బారికేట్లుతో మూసి వేశారు. ఆధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు అందించాన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా డిఆర్డీఏ ద్వారా పట్టణానికి మాస్కుల సరఫరా చేశారు. వీటిని తొలుత రెడ్‌ జోన్‌ ఏరియాలో ఇంటింటా పంపిణీ చేశారు.

సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాయంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీటిని వలంటీర్లు, సచివాలయం ఉద్యోగుల ద్వారా పట్టణ ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ వ్యక్తిగత రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తాను సురక్షితంగా వుండటం ద్వారా సమాజాన్ని సురక్షితంగా వుంచినవారవుతారని చెప్పారు. సీఐ బిఎస్‌ అప్పారావు మాట్లాడుతూ పట్టణంలో లాక్‌ డౌన్‌లో ఎటువంటి మినహాయింపులూ లేవని చెప్పారు. సోషల్‌మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మి కష్టాల పాలవద్దని హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్పా ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌వి నాగేశ్వరరావు, ఎస్‌ఐ అబ్దుల్‌ నభీ పాల్గొన్నారు.


Tags:    

Similar News