Ramakrishna: దేశాన్ని కాపాడాలి... జగన్‌ను సాగనంపాలి
Ramakrishna: జగన్ మోహన్ రెడ్డి అసమర్థ పాలనతో అప్పులు పెరిగాయి
Ramakrishna: దేశాన్ని కాపాడాలి... జగన్‌ను సాగనంపాలి
Ramakrishna: దేశాన్ని కాపాడాలి... జగన్‌ను సాగనంపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేపట్టిన రామకృష్ణ బృందం కడపకు చేరుకుంది. జగన్ మోహన్ రెడ్డి అసమర్థ పాలనతో అప్పులు పెరిగాయని విచారం వ్యక్తంచేశారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూడా చేపట్టలేదని ధ్వజమెత్తారు. ఉన్న ప్రాజెక్టులకు గేట్లను కూడా మరమ్మతు చేసేపరిస్థితి లేకపోయిందన్నారు. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా తిరుపతిలో సెప్టెంబరు 8 తేదీన భారీ ర్యాలీ నిర్వహించబోతున్నామని తెలిపారు.