Rain Alert: ఏపీలో వానలే వానలు.. మూడు రోజులు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు అలర్ట్

Update: 2025-05-04 03:23 GMT

Rain Alert: ఏపీలో వానలే వానలు.. మూడు రోజులు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు అలర్ట్

Rain Alert: వాతావరణ అనిశ్చితితో రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. పిడుగులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

విశాఖ, అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,క్రిష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో వానలు పడవచ్చని తెలిపింది. మరోవైపు శుక్రవారం వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 42, నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 41.7, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

శుక్రవారం నాడు పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలు చోట్ల ఈదురుగాలులు బీభత్సం స్రుష్టించాయి. తెల్లవారుజామున 3 నుంచి 5గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పల్నాడు జిల్లా బెల్లంకొండలోని పలు వీధుల్లో చెట్లుకూలి కరెంట్ తీగలపై పడటంతో స్తంభాలు నేలకొరిగాయి. బెల్లంకొండ మండలం వ్యాప్తంగా కరెంట్ సరఫరా స్తంభించిపోయింది.

అటు తెలంగాణలోనూ మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాలు ఖమ్మం, వరంగల్, కొత్తగూడెం, నల్లగొండలో ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. సాయంత్రం ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. 

Tags:    

Similar News