PSLV C-55: ఈనెల 22 న షార్ నుండి పీఎస్ఎల్వీ సీ-55 రాకెట్ ప్రయోగం

*తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఏర్పాట్లు

Update: 2023-04-20 06:30 GMT

PSLV C-55: ఈనెల 22 న షార్ నుండి పీఎస్ఎల్వీ సీ-55 రాకెట్ ప్రయోగం

PSLV C-55 Rocket: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో వాణిజ్యప్రయోగానికి సిద్ధమవుతోంది పూర్తి విదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన సింగపూర్ కి చెందిన లియోస్-2 ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి ప్రయోగ వేదికపై PSLV C_55 వాహకనౌక అనుసంధానం పూర్తయింది. ఈనెల 22న మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్ ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఇందులో రాకెట్ దశలవారీ అమరిక, ఉపగ్రహాల అనుసంధానం, రిహార్సల్లో గుర్తించిన అంశాలపై చర్చించి ప్రయోగానికి పచ్చజెండా ఊపనున్నారు. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్-2, 16 కిలోల లూమెలైట్-4ను వాహకనౌక కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ప్రయోగానికి సంభందించి గతనెల 10న పీఎస్ఎల్వీ-సి55 అనుసంధానం పీఐఎఫ్ లో ప్రారంభమైంది. అక్కడ రాకెట్ లోని రెండు దశలను పూర్తిచేసి మొదటి ప్రయోగ వేదికకు ఈనెల 5న తీసుకొచ్చారు. ఇక్కడ మూడు, నాలుగు దశల అనుసంధానం చేపట్టిన తర్వాత ఉష్ణకవచంలో (హీట్ షీల్డు) సింగపూర్‌ టెలియన్ ప్రవేశపెట్టబోతున్నారు.ఇది ముగిసిన తర్వాత ప్రయోగానికి ముందు 25.30 గంటలపాటు కౌంట్ డౌన్ నిర్వహించేలా శాస్త్రవేత్తలు నిర్ణయించారు.

PSLV C_55 ప్రయోగ నేపథ్యంలో షార్ లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. విదేశీ ఉపగ్రహం ప్రయోగించనున్న నేపథ్యంలో రక్షణపరమైన చర్యలు చేపట్టారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షార్‌ భద్రతాధికారులు ఇప్పటికే షార్ పరిసరాలను ప్రధాన కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఉంటున్న విభాగాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. షార్ తో పాటు తీర ప్రాంతంలోనూ భద్రత చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News