AP Volunteers Protest: వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్.. ధర్నాలతో దద్దరిల్లిన రాష్ట్రం
AP Volunteers Protest: వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరికి చెప్పాలన్న పవన్
వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్.. ధర్నాలతో దద్దరిల్లిన రాష్ట్రం
AP Volunteers Protest: వాలంటీర్ల వ్యవస్థపై రాజకీయ దుమారం రేగుతోంది. వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగింది. వాలంటీర్ల ధర్నాలతో రాష్ట్రం దద్దరిల్లింది. పవన్‌పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జనసేన నేతలు నిరసన తెలిపారు. నిరసన సమయంలో జనసేన నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం దిష్టిబొమ్మను దగ్దం చేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల సమాచారం ఎలా తీసుకుంటారని పవన్ ప్రశ్నించారు. MRO తప్పు చేస్తే పై అధికారికి కంప్లైంట్ చేయొచ్చు.. మరి వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. ఇక వాలంటీర్లకు ప్రజల డబ్బుతో జీతాలు ఇస్తున్నారన్న పవన్.. కంప్లైంట్ కోసం వాట్సాప్ గ్రూప్, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలన్నారు.