మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై నేదురుమల్లి సంచలన వ్యాఖ్యలు

మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై నేదురుమల్లి రాంకూమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-12-02 10:23 GMT

మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై నేదురుమల్లి సంచలన వ్యాఖ్యలు

మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై నేదురుమల్లి రాంకూమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో రావూరు, సైదాపురం, కలువాయి మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతామంటే.. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆనం నీటి వివాదాలు వస్తాయన్నారు. ఆ మండలాల ప్రజలకు ఇష్టం లేకున్నా.. నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ప్రజలతో ధర్నా చేయించారని ఆరోపించారు.

గతంలో అల్తూరుపాడు రిజర్వాయర్ పనులు జరగకుండా చేసిన ఘనత ఆనం రామనారాయణరెడ్డిదని మండిపడ్డారు. ఇప్పడు మండలాల విషయంపై ఆనం ఎందుకు మాట్లాడటం లేదని.. ఆరోజు ఉన్న సమస్యలు ఇప్పడు లేవా అని ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలు సేకరించి.. వారి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని నేదురుమల్లి పేర్కొన్నారు.

Tags:    

Similar News