నాడు అడ్డంకులు.. నేడు రక్షణ.. విశాఖ పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో సరికొత్త సమీకరణాలు..

Pawan Kalyan: ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు విశాఖ వెళ్లిన జనసేనానికి పోలీసులు, ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది రక్షణగా ఉన్నారు.

Update: 2022-11-12 15:06 GMT

నాడు అడ్డంకులు.. నేడు రక్షణ.. విశాఖ పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో సరికొత్త సమీకరణాలు..

Pawan Kalyan: ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు విశాఖ వెళ్లిన జనసేనానికి పోలీసులు, ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది రక్షణగా ఉన్నారు. విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి హోటల్‌కు ఆయన చేరుకునేత వరకు ప్రత్యేక భద్రత కల్పించారు. హోటల్‌ వద్ద కూడా ఎక్కడా ఆటంకం లేకుండా చూశారు. గత నెల 15న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ పర్యటనలో పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో నాటికీ నేటికీ ఎంత మార్పు అన్న అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

నాడు విమానాశ్రయంలో ర్యాలీగా బయలుదేరినప్పటి నుంచి మార్గమధ్యలో పవన్‌ను నిలిపేసే వరకూ తీవ్ర ఇబ్బందులు పెట్టారని జనసేన నేతలు ఆరోపించారు. భద్రతా కారణాలను సాకుగా చూపించి తమను హడలుగొట్టారని జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ బస చేసిన హోటల్‌లో అర్ధరాత్రి తనిఖీలు చేసి, పార్టీ నాయకులను అరెస్టు చేశారు. జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా పలు నిబంధనలు పెట్టారన్నారు. నాడు అలా వ్యవహరించిన పోలీసు యంత్రాంగం శుక్రవారం మాత్రం జాగ్రత్తపడడం గమనార్హం.

Tags:    

Similar News