వారిపై వివక్ష కనిపిస్తోంది.. ప్రధాని మోదీతో సీఎం జగన్

లాక్ డౌన్ మ‌రో ఐదు రోజుల్లో ముగియ‌నున్న నేప‌థ్యంలో త‌దుప‌రి వ్యూహంపై చ‌ర్చించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.

Update: 2020-05-11 14:34 GMT
YS Jagan video Conference with Prime minister Narendra Modi

లాక్ డౌన్ మ‌రో ఐదు రోజుల్లో ముగియ‌నున్న నేప‌థ్యంలో త‌దుప‌రి వ్యూహంపై చ‌ర్చించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సీఎం జగన్ వివరించారు. కరోనాకు వ్యాక్సిన్‌ కనుక్కొనే వరకు వైరస్‌తో క‌లిసి జీవించాల్సి ఉంటుంద‌ని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల‌ని సీఎం చెప్పారు. సామాజిక‌ దూరం పాటించడం, మాస్కులు ధరించడం, హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత పరశుభ్రత పాటించడం ముఖ్య‌మ‌ని తెలిపారు.

లాక్‌డౌన్ కాలం‌లో కేంద్రం ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చిందని, దీని వల్ల కేసులను చెప్పారు. కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్న కుటుంబాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. వారిప‌ట్లు ప్ర‌జ‌ల్లోచులక‌న‌ భావన నెలకొందని, వారిపై వివక్ష కనిపిస్తోందని చెప్పారు. దీని వ‌ల్ల‌న క‌రోనా ల‌క్ష్య‌ణాలు ఉన్న స్వ‌చ్ఛందంగా ముందుకు రావ‌డం లేద‌ని అన్నారు. కరోనా కేసులు కనిపించిన ప్రాంతాలను క్లస్టర్లు, కంటైన్మెంట్‌ జోన్లుగా.. గుర్తించి సంస్థాగతంగా‌ ప్రక్రియపై మరోసారి ఆలోచన చేయాల్సి ఉందని సీఎం జగన్ తెలిపారు. 85 శాతం కేసుల్లో కొద్ది లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని సీఎం జ‌గ‌న్న చెప్పారు.



Tags:    

Similar News