PM Modi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రధాని మోడీ

PM Modi: పుట్టపర్తిలో శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2025-11-19 08:04 GMT

PM Modi: పుట్టపర్తిలో శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోడ్డుమార్గాన పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్న ఆయన.. శ్రీసత్యసాయి మహా సమాధిని సందర్శించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా మోడీకి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం పలువురు రైతులకు ప్రధాని మోడీ గోదానం చేశారు. ఇక శ్రీసత్యసాయిబాబా స్మారక నాణెం, స్టాంప్ విడుదల చేయనున్నారు మోడీ. 100 రూపాయల నాణెంతో పాటు స్టాంప్‌ విడుదల చేయనున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో శ్రీసత్యసాయిబాబా జయంతి వేడుకలు జరుగుతుండగా ఈ నెల 23 వరకు సత్యసాయి శతజయంతి ఉత్సవాలు కొనసాగనున్నాయి.

Tags:    

Similar News