Mandapeta: చదువుకు పేదరికం అడ్డుకాకూడదు: మంత్రి బోసు

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని దానికి పేదరికం అడ్డు కాకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

Update: 2020-02-24 13:11 GMT

మండపేట: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని దానికి పేదరికం అడ్డు కాకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సోమవారం మండపేట మునిసిపల్ పరిధిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన 'జగనన్న విద్య దీవెన-వసతి దీవెన' పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం కార్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించటంతో పాటు వసతి దీవెన పథకం ద్వారా విద్యార్థుల తల్లి బ్యాంక్ అకౌంట్ కు ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఏ.ఎమ్.సి.చైర్మన్ తేతలి వనజ,వైస్ చైర్మన్ ఎస్ రాముడు, మునిసిపల్ కమిషనర్ రామ్ కుమార్, ఎం.డి.ఓ సారిపల్లి గౌతమి, కర్రీ పాపరాయుడు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News