Andhra Pradesh: ఏపీలో జిల్లాల పునర్విభజనపై హైకోర్టులో పిల్
Andhra Pradesh: నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ దాఖలైన పిల్
Andhra Pradesh: ఏపీలో జిల్లాల పునర్విభజనపై హైకోర్టులో పిల్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో జిల్లా పునర్విభజనపై హైకోర్టు పిల్ దాఖలైంది. జిల్లాల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ రద్దుచేయాలని పిటిషనర్లు కోరారు. గుంటూరు జిల్లా అప్పాపురంకి చెందిన దొంతినేని విజయ్ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి. సిద్ధార్థ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు.
జిల్లా విభజనకు సంబంధించిన ముసాయిదా జీవోల అమలుచేయకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని పిటిషనర్లు కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించిన పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ధర్మాసనం వ్యాజ్యంపై విచారణ చేపట్టనుంది. జిల్లాల విభజనపైపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో వాద, ప్రతివాదనలు జరగబోతున్నాయి.