AP Voter List: ఓటర్ల జాబితాలో మహిళ స్థానంలో సీఎం జగన్ ఫొటో
AP Voter List: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల మండలం వై చెర్లోపల్లిలో జనపతి గురవమ్మ అనే మహిళ ఓటర్ ఫోటో స్థానంలో సీఎం జగన్ ఫోటో రావడంతో అధికారుల,
AP Voter List: ఓటర్ల జాబితాలో మహిళ స్థానంలో సీఎం జగన్ ఫొటో
AP Voter List: ప్రకాశం జిల్లా ఓటర్ల జాబితాలో ఒక విచిత్రం చోటు చేసుకుంది. ఏకంగా అక్కడి ఓటర్ల జాబితాలో సీఎం జగన్ ఫోటో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెర్లోపల్లి గ్రామ ఓటర్ల జాబితాలో సీఎం జగన్ ఫోటోను అధికారులు ముద్రించారు. గురవమ్మ అనే మహిళ ఫోటోకి బదులు సీఎం జగన్ ఫోటోను ముద్రించారు. జగన్ ఫొటోతో ఉన్న లిస్ట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అధికారులు హడావిడిగా దానికి సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.