Perni Nani: పింఛన్లపై చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారు
Perni Nani: గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన వ్యక్తి చంద్రబాబు
Perni Nani: పింఛన్లపై చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారు
Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు పెన్షన్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా అని మండిపడ్డారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారని విమర్శించారు. బాబు ఏనాడు సచివాలయం గుమ్మం తొక్కలేదని దుయ్యబట్టారు. ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదని కొనియాడారు. 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా తము అడ్డుకోలేదన్నారు పేర్ని నాని. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు పంచుకున్నారని ప్రస్తావించారు. పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఇప్పుడు ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.