Payakaraopeta: సామమాజిక దూరం ఇదేనా !

చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం ఉంటుంది. నిబంధనల్ని ఆచరించినప్పుడే మంచి ఫలాతం ఉంటుంది.

Update: 2020-04-15 16:56 GMT

పాయకరావుపేట: చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం ఉంటుంది. నిబంధనల్ని ఆచరించినప్పుడే మంచి ఫలాతం ఉంటుంది. కరోనా వైరస్ కట్టడికై లాక్ డౌన్ విధించి ప్రజలంతా ఇళ్ళలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది, అయితే కొన్ని అత్యవసర పనులకు బయటకు వచ్చినప్పుడు నిత్యావసర దుకాణాలు, మందుల షాపులు , బ్యాంకులు వద్ద సామాజిక దూరం పాటించాలని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు.

పల్లేపల్లెలో నిరంతరం గస్తీ తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ కొందరు పోలీసుల ఆజ్ఞలను బ్రేక్ చేస్తూనే ఉన్నారు. పోలీసులు ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు నిబంధనలను పాటిస్తున్నారు. సామాజిక దూరం అనేది మనల్ని మనం రక్షించుకుంటూ, మన కుటుంబాల్ని, సమాజాన్ని రక్షించుకునే ఆయధమని గ్రహించలేని కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు సత్యవరంలోని గ్రామీణ బ్యాంకు వద్ద కస్టమర్లు సామాజిక దూరం పాటించకుండా గుంపుగా కనిపించారు. ఈ నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం.


Tags:    

Similar News