East Godavari: పెడపర్తిలో మాజీ ఎమ్మెల్యే వర్సెస్ సర్పంచ్
East Godavari: అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ సర్పంచ్ కాంతమ్మ ఆగ్రహం
Representational Image
East Godavari: తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో మాజీ ఎమ్మెల్యే వర్సెస్ సర్పంచ్ కొనసాగుతోంది. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ సర్పంచ్ కాంతమ్మ.. గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. ఇవాళ కార్యకర్తలతో కలిసి, రామకృష్ణ ఇంటి ముట్టడికి ఆమె ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.