Pawan Kalyan: విడిచిపెట్టకపోతే పీఎస్‌కే వస్తా..
Pawan Kalyan: జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
Pawan Kalyan: విడిచిపెట్టకపోతే పీఎస్‌కే వస్తా..
Pawan Kalyan: జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఏపీ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. విశాఖపట్నంలో ఇలాంటి ఉన్నతమైన పోలీసుల ప్రవర్తనను చూడటం చాలా దురదృష్టకరమన్నారు. జనసేన ఎప్పుడూ ఏపీ పోలీసులను ఎంతో గౌరవిస్తుందన్నారు. జనసేన నాయకులను అరెస్టు చేయడం సరైన చర్యకాదని..దీనిపై డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని నాయకులను విడుదల చేయాలని కోరుతున్నట్లు ట్విటర్ లో తెలిపారు. లేదంటే తానే పీఎస్‌కు వచ్చి తమ వాళ్లకు సంఘీభావాన్ని తెలుపుతానని ప్రకటించారు. అంతేకాదు విశాఖ పర్యటనలో తనను పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తాను ప్రజలకు అభివాదం చేయకుండా పోలీసు ఉన్నతాధికారులే తనకారు ఎక్కి మరీ అడ్డం పడ్డారని ఆరోపిస్తూ ఓ వీడియోను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు.