Pawan Kalyan: అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
Pawan Kalyan: నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలి
Pawan Kalyan: అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
Pawan Kalyan: ఏపీలో అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రైతులు ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పులతో సతమతమవుతున్న కౌలు రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు.
అకాల వర్షాలు అన్నదాతలను కుంగదీస్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారాయన.. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలన్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయని పవన్ అన్నారు.