Sankhavaram:కరోనా వైరస్ నియంత్రణ పై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే పర్వత

Update: 2020-04-16 08:21 GMT

శంఖవరం: మండల కేంద్రం శంఖవరం గ్రామంలో ఎంపీడీవో ఆఫీస్ నందు ప్రత్తిపాడు నియోజకవర్గ అధికారులు, ఆర్డీవో, డీఎస్పీ లతో ప్రత్తిపాడు నియోజ కవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కరోనా వైరస్ పై రివ్యూ నిర్వహించారు.

రెడ్ జోన్ ప్రకటించిన కత్తిపూడి గ్రామంలో తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకునే చర్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అధికారులకు సహకరించి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోరారు. పేద ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News