Eluru: మురిగిన గుడ్లు.. మాకొద్దు.. తల్లిదండ్రుల ఆవేదన..
Eluru: ప్రభుత్వం తరఫున పాఠశాలల్లో ఇచ్చే గుడ్లు మురిగిపోతున్నాయంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Eluru: మురిగిన గుడ్లు.. మాకొద్దు.. తల్లిదండ్రుల ఆవేదన..
Eluru: ప్రభుత్వం తరఫున పాఠశాలల్లో ఇచ్చే గుడ్లు మురిగిపోతున్నాయంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇచ్చిన గుడ్లు మురిగిపోతున్నాయి.. మధ్యాహ్న భోజనం బాగా లేదంటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో విద్యార్థులు క్యారేజీలు తీసుకెళ్తే ఎందుకు తెస్తున్నారంటూ టీచర్ల బెదిరిస్తున్నారని, అక్కడ అన్నం బాగా లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం గుడ్ల పంపిణీపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆకస్మికంగా తనిఖీలు చేస్తే మంచి గుడ్లు పంపిణీ చేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. గతంలో మూడు గుడ్లు ఇచ్చారని, వాటిలో రెండు మురిగిపోయాయని, 31న మూడు గుడ్లు ఇచ్చారని, వాటిలో మొత్తం మూడు గుడ్లు మురిగిపోయాయని ఓ విద్యార్థి ఆరోపించారు. తమ చిన్నారులకు మురిగిపోయిన గుడ్లు ఇచ్చారని ఆరోపించారు విద్యార్థి తాత.