ఆ జీవోపై రివ్యూ పిటిషన్ కు సిద్ధమంటున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

Update: 2020-06-14 16:05 GMT

ఈ నెల 16వ తేదీ నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జీవో నెంబర్ 3 గురించి గళమెత్తనున్నట్టు విశాఖ జిల్లా పాడేరు శాసనసభ సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఆదివాసీల విషయంలో సుప్రీం కోర్టు జీవో నెంబర్‌ 3 రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును పునరుద్ధరించాలని ఆమె కోరారు. ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనుల మనుగడ కు దెబ్బ తీసే విదంగా కరోనా విపత్తు సమయంలొ ఇది వెలుగులోకి రావటం గిరిజనుల గొంతు నొక్కేయటమే అన్నారు. దీనిపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయటం దురదృష్టకరం అన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం తరఫున శాసనసభ సభ్యురాలిగా తాను, పార్లమెంట్ సభ్యురాలిగా గొట్టేటి మాధవి గట్టిగా ఫైట్ చేస్తామని చెప్పారు.ఇప్పటికే గిరిజన సంఘాలు, గిరిజన యూనియన్లు, ప్రజా సంఘాలతో కలిసి జీవో నెంబర్ 3 పై రివ్యూ పిటిషన్ దాఖలు చేయటానికి ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో ప్రత్యేకంగా మాట్లాడతామన్నారు భాగ్యలక్ష్మి.


Tags:    

Similar News