Oxygen: అపర సంజీవనిగా మారిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌

Oxygen: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భవిష్యత్‌ను కేంద్రం అందకారం చేసేందుకు ప్రయత్నించింది.

Update: 2021-04-23 16:15 GMT

Oxygen: అపర సంజీవనిగా మారిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌

Oxygen: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భవిష్యత్‌ను కేంద్రం అందకారం చేసేందుకు ప్రయత్నించింది. ప్రైవేటీకరిస్తామని వరుస ప్రకటనలతో ప్రకంపనలు సృష్టించింది. కానీ ఇప్పుడు అదే స్టీల్‌ ప్లాంట్‌ వేలాదిమంది కరోనా పేషెంట్లకు ప్రాణభిక్ష పెడుతుంది. దేశానికి అపర సంజీవనిగా మారుతుంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో 5 ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో రోజుకు సగటున 100 టన్నులకు పైగా ఆక్సిజన్‌ తయారీ అవుతోంది. ఇక్కడి నుంచి ఏపీతో సహా ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు.

తాజాగా గ్రీన్ ఛానెల్ పద్ధతిలో మహారాష్ట్రాకు 100 టన్నుల ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలో వందలాది మంది ఆక్సిజన్‌ కోసం కొట్టుమిట్టాడుతున్నారు. వారందరికీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సకాలంలో ఆక్సిజన్‌ అందిస్తోంది. తన భవిష్యత్‌ ఎలా ఉన్నా ఎంతోమంది కరోనా బాధితులకు భరోసా కల్పిస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్. క్షిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఇప్పటికైనా వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి. 

Tags:    

Similar News