సోమశిలకు కొనసాగుతున్న వరద

*జలకళను సంతరించుకున్న జలాశయం *ఎగువ నుంచి భారీగా వస్తున్న నీరు *కండలేరు జలాశయానికి నీటి విడుదల

Update: 2019-10-30 06:33 GMT

నెల్లూరులోని సోమశిల జలాశయానికి జలకళ వచ్చింది. ఇన్నాళ్లూ ఎడారిని తలపించిన రిజర్వాయర్ కడప, కర్నూలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో జలాశయం నిండుకుండలా మారింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సోమశిల నీటి మట్టం పెరిగింది. జలాశయం పూర్తి సామర్ద్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 77 వేల,345 టీఎంసీలు ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఏ క్షణామైనా గేట్లను ఎత్తే అవకాశం ఉంది. దీంతో జిల్లా రైతాంగంతో పాటు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సోమశిల జలాశయం పూర్తి సామర్ద్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 77 వేల,345 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం జలాశయానికి 28 వేల,944 క్యూసెక్కుల నీరు వస్తుండగా 12వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వచ్చే ప్రవాహం మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమశిల జలాశయంలో నీటి నిల్వ పెరుగుతున్న క్రమంలో అన్నదాతల ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది 9 వేల క్యూసెక్కుల నీరు కండలేరు జలాశయానికి విడుదల చేసే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

Full View

Tags:    

Similar News