ONGC Blowout: ఇరుసుమండలో అదుపులోకి రాని బ్లోఅవుట్.. వాటర్ స్ప్రింకర్లతో హీట్ తగ్గించేందుకు ప్రయత్నాలు
ONGC Blowout: మలికిపురం ఇరుసుమండ ఓఎన్జీసీలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.
ONGC Blowout: ఇరుసుమండలో అదుపులోకి రాని బ్లోఅవుట్.. వాటర్ స్ప్రింకర్లతో హీట్ తగ్గించేందుకు ప్రయత్నాలు
ONGC Blowout: మలికిపురం ఇరుసుమండ ఓఎన్జీసీలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. బ్లో అవుట్ జరిగి 24 గంటలు గడిచినా అగ్నికీలలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటితో పోలిస్తే ప్రస్తుతం అక్కడ పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తోంది. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక ఇంజినీర్ విభాగం... పూర్తిగా మంటలు ఆర్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది.
ఇక బ్లో అవుట్ అయిన రిగ్ చుట్టూ ఉన్న యంత్రాలను ఒక్కొక్కటిగా వేరేచోటకి తరలిస్తున్నారు అక్కడి సిబ్బంది. వాటర్ స్ప్రింకర్లతో అక్కడ హీట్‌ను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రానికి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.