Konaseema ONGC Blowout: ఇరుసుమండలో ఇంకా అదుపులోకి రాని బ్లోఅవుట్
Konaseema ONGC Blowout: కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మలికిపురం మండలం ఇరుసుమండ దగ్గర ONGC బావిలో మూడ్రోజుల క్రితం మంటలు చెలరేగాయి.
Konaseema ONGC Blowout: కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మలికిపురం మండలం ఇరుసుమండ దగ్గర ONGC బావిలో మూడ్రోజుల క్రితం మంటలు చెలరేగాయి. నిన్న మంటల తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇంకా 10 నుంచి 15 మీటర్లకు పైగా ఎగిసిపడుతున్నాయి. బావిలో గ్యాస్ పీడనస్థాయి క్రమంగా తగ్గుతుండటంతో ONGC చర్యలు వేగవంతం చేసింది. మంటలను అదుపుచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి నిపుణులు, విపత్తు బృందాలు తరలివచ్చారు.
వేడి ప్రభావం పెరగకుండా బావికి మూడువైపులా నీళ్లు కొడుతూ మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి దాదాపు 10 రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 75 కొబ్బరిచెట్లు, మూడు ఎకరాల పంట దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.