Amaravati Phase 2 Land Pooling Begins: అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
Amaravati Phase 2 Land Pooling Begins: ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది.
Amaravati Phase 2 Land Pooling Begins: ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమానులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో కలిసి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరించారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల నుంచి రైతుల నుంచి ప్రభుత్వం 16వేలకు పైగా ఎకరాలను సమీకరించనుంది.
ఈ సందర్భంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కావాలని మంత్రి నారాయణను రైతులు కోరారు. ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించారు. కేంద్రం రాజధాని నోటిఫై చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రైతులతో నారాయణ చెప్పారు. ఇక రాజధాని మార్పు ఉండదని రైతులకు నారాయణ భరోసా ఇచ్చారు. మూడేళ్లలో తమ భూములు అభివృద్ధి చేయకపోతే ఎకరాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.