Amaravati: అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్
Amaravati: అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా ఇవాళ రెండోదశ పూలింగును ప్రారంభించనున్నారు.
Amaravati: అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా ఇవాళ రెండోదశ పూలింగును ప్రారంభించనున్నారు. రెండోదశలో మొత్తం 20వేల 492 ఎకరాలు సమీకరించనున్నారు. దీనిలో 16వేల 562 ఎకరాలు పట్టా భూమి, 104 ఎకరాలు అసైన్డ్ భూమి, 3వేల 828 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మొదట తుళ్లూరు మండల పరిధిలోని వడ్డమాను, అమరావతి మండల పరిధిలోని యండ్రాయి గ్రామంలో సమీకరణ ప్రారంభించనున్నారు.
ఇవాళ సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం వంటి కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో డిన్నర్ మీటింగ్‌లో చంద్రబాబు చర్చలు జరపనున్నారు.