Tirupati: తిరుపతిలో క్షుద్రపూజల కలకలం

Tirupati: ఇంటి యజమానులకు అదుపులోకి తీసుకున్న పోలీసులు?

Update: 2023-10-15 09:18 GMT

Tirupati: తిరుపతిలో క్షుద్రపూజల కలకలం

Tirupati: తిరుపతిలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. తిరుపతి శివారు తిరుచానూరు పరిధిలోని ముళ్లపూడి గ్రామంలోని దక్షణామూర్తి కాలనీలోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహిస్తుండగా స్థానికులు కొందరు గమనించారు. అమావాస్య రోజు అర్ధరాత్రి క్షుద్రపూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్షుద్రపూజలు చేయడానికి దూరప్రాంతం నుంచి ఓ మాంత్రికుడిని పిలిపించి, జంతు బలి ఇవ్వడం చూసిన స్థానికులు కొందరు డయల్ 100 ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించార. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షద్రపూజలు నిర్వహిస్తున్న మాంత్రికుడిని, ఆ ఇంటి యజమానులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల తిరుపతిలో క్షుద్రపూజల నిర్వహించిన ఇంటి యజమానులపై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు..

Tags:    

Similar News