S.Rayavaram: నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం

కరోనా వైరస్ మహమ్మారి వ్యాధిపై ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా వాటిని ప్రజలు పెడచెవిన పెడుతున్నారు.

Update: 2020-03-29 05:38 GMT

ఎస్.రాయవరం: కరోనా వైరస్ మహమ్మారి వ్యాధిపై ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా వాటిని ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. లాక్ డౌన్ ప్రకటించి అందరూ ఇళ్ళకే పరిమితమవ్వాలని ఆజ్ఞలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. నిత్యావసర సరుకులు కొనుగోలుకై కొంత సమయం సడలించి జాగ్రత్తలు పాటించాలని తెలిపినా ఆచరించడం లేదు. దుకాణాల వద్ద మార్కింగ్ చేసి, సామాజిక దూరం పాటించాలని హెచ్చరించినా లెక్క చేయడంలేదు.

ఆదివారం ఉదయం అడ్డురోడ్ లోని పలు దుకాణాల వద్ద వినియోగదారులు గానీ, షాపు యజమానులు గానీ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించలేదు. పోలీసులు నిరంతరం గస్తీ తిరుగుతున్నప్పటికీ, సడలింపు వేళల్లో ప్రజలంతా దుకాణాల వద్ద గుంపులుగానే కనిపిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు, మాంసం దుకాణాల వద్ద జనం అధికంగా గుంపులుగా కనిపించారు. కరోనాపై జాగ్రత్తలు వ్యక్తిగతం గాను , సామాజికం గాను అవసరమని మైక్ ల ద్వారా ప్రచారం చేస్తూ ఎంత మొత్తుకున్నా ప్రజలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం.


Tags:    

Similar News