Nara Lokesh: అక్రమాస్తుల కేసు మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నారు
Nara Lokesh: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోల్పోతే రాయలసీమ ఎడారే
Nara Lokesh: అక్రమాస్తుల కేసు మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నారు
Nara Lokesh: ఎక్స్ వేదికగా సీఎం జగన్‌పై నారా లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ చేసిన నేరాలు ఏపీ ప్రయోజనాలకు ఉరివేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. అక్రమాస్తుల కేసు మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నారని, రుషికొండకు గుండు కొట్టించిన కేసు నుంచి తప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్‌కి నీళ్లొదిలారని లోకేష్ ఆరోపించారు. బాబాయ్ హత్య కేసులో తమ్ముడిని కాపాడేందుకు పోలవరాన్ని ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. రాయలసీమ బిడ్డనంటూ క్యాన్సర్ గడ్డలా పీడిస్తున్నాడని ఫైర్ అయ్యారు. జగన్ వైఫల్యం వల్లే కృష్ణాజలాల కేటాయింపులపై పునఃసమీక్ష జరుగుతోంది. జగన్‌కి ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో ఏమేమి కోల్పోయారో గుర్తించండని ప్రజలకు సూచించారు లోకేష్. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోల్పోతే రాయలసీమ ఎడారి అయ్యే ప్రమాదం ఉందన్నారు.