Nara Lokesh: రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్
Nara Lokesh: లోకేష్, పునీత్‌లను వేరువేరుగా విచారించనున్న సీఐడీ
Nara Lokesh: రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్
Nara Lokesh: రెండో రోజు లోకేష్ సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. IRR అలైన్‌మెంట్ మార్పు కేసులో లోకేష్‌ను సీఐడీ ఇవాళ కూడా విచారించనుంది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇవాళ హాజరుకావాలని మరోసారి లోకేష్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. 8 గంటల పాటు లోకేష్‌ను ప్రశ్నించిన సీఐడీ అధికారులు.. హెరిటేజ్ గ్రూప్ నిర్ణయాలపై ప్రశ్నలు సంధించారు. అందుకు సంబంధించిన విషయాలు తనకు తెలియదన్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు అనేదే లేదని... తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం ఇబ్బందులు సృష్టిస్తుందన్నారు. విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఎలాంటి ప్రశ్నలు అడగలేదన్నారు.