సొంత ఖర్చులతో మినరల్ వాటర్ అందించిన పారిశుద్ద్య కార్మికులు

కరోనా కట్టడికి డాక్టర్లు, పోలీసులతో పాటు పారాశుద్ధ్య కార్మికులు విస్తృతమైన సేవలు అందిస్తూనే ఉన్నారు.

Update: 2020-04-14 04:30 GMT

ఎస్.రాయవరం: కరోనా కట్టడికి డాక్టర్లు, పోలీసులతో పాటు పారాశుద్ధ్య కార్మికులు విస్తృతమైన సేవలు అందిస్తూనే ఉన్నారు. అయితే నక్కపల్లి మండలం వేంపాడు గ్రామానికి చెందిన పారిశుద్ద్య కార్మికులు తమ సేవలతో మరొక్క అడుగు ముందుకు వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామస్థులు తీవ్ర మంచినీటి ఎద్దడితో ఇబ్బంది పడుతుండడం గమనించిన బోడపాటి ప్రకాష్ రావు, కండవిల్లి యేసుబాబు, కండవల్లి సత్తిబాబు తమసొంత ఖర్చులతో మినరల్ వాటర్ ని పంపిణీ చేశారు.

ఆటోలో ఉంచిన ట్యాంక్ ద్వారా ప్రతీ వీధికి సరఫరా చేశారు. వీరు చేస్తున్న సేవ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తుందని అంబేద్కర్ యూత్ ఫోర్స్ పాయకరావుపేట నియోజకవర్గ కమాండర్ కుంచే మధు సంతోషం వెలిబుచ్చారు. వీరిని చూసి మరికొందరు సమాజ సేవకు ముందుకొస్తారని మధు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వీరి సేవలను గ్రామస్థులు పలువురు అభినందించారు.


Tags:    

Similar News