Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రీ నోటిఫై అయ్యే అవకాశం
Andhra Pradesh: ఆరు నెలలకు మించి స్థానిక ఎన్నికలు వాయిదా పడితే రీ నోటిఫై చేయాల్సిందే
Representational Image
Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రీ నోటిఫై అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు నెలలకు మించి స్థానిక ఎన్నికలు వాయిదా పడితే రీ నోటిఫై చేయాల్సిందే.. అయితే ఆగిన చోట నుంచే ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రీ షెడ్యూల్ ఇచ్చారు. కరోనా కారణంగా వాయిదా పడినందున.. రీ నోటిఫికేషన్ అవసరం లేదంటున్నారు ఎన్నికల కమిషనర్. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. ఇవాళ ఎస్‌ఈసీ, న్యాయవాదుల వాదనలు విననుంది హైకోర్టు.