Mudragada Padmanabham: నిలకడగా ముద్రగడ ఆరోగ్యం.. కుటుంబ సభ్యుల ప్రకటనతో క్లారిటీ

Mudragada Padmanabham Health Update: ప్రస్తుతం ముద్రగడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు.

Update: 2025-07-20 03:27 GMT

Mudragada Padmanabham: నిలకడగా ముద్రగడ ఆరోగ్యం.. కుటుంబ సభ్యుల ప్రకటనతో క్లారిటీ

Mudragada Padmanabham: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి మరియు వైఎస్సార్‌సీపీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆయనను కాకినాడ అహోబిలం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాత్రి 10.30 గంటలకు ఆయనను మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ముద్రగడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఆరోగ్యం విషయంలో వస్తున్న అపోహలను కుటుంబ సభ్యులు ఖండించారు. ముద్రగడ కుమారుడు గిరిబాబు మాట్లాడుతూ, "నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. మీడియా, సోషల్‌ మీడియాలో వస్తున్న అవాస్తవ కథనాలను నమ్మవద్దు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News