Viveka Murder Case: వివేకా హత్య కేసులో నేడు సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి
Viveka Murder Case: రెండో సారి విచారణకు హాజరు కానున్న అవినాష్ రెడ్డి
Viveka Murder Case: వివేకా హత్య కేసులో నేడు సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి ఇవాళ సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మరో వైపు అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిపై సీబీఐ ఛార్జ్‌షీట్ వేసింది. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్‌ను చేర్చింది సీబీఐ. వివేకా హత్య కేసులో మొత్తం 145 పేజీలతో మూడో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు సీబీఐ అధికారులు. అయితే చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులరందరీని కోర్టులో హాజరుపర్చనున్నారు సీబీఐ అధికారులు.