రైతులకు శుభవార్త .. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు..

Update: 2020-05-12 01:53 GMT
monsoons are coming (rep.image)

ఈ ఏడాది రుతు పవనాలు ముందుగానే వస్తున్నాయి. ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లో కి కొన్ని ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

దక్షిణ అండమాన్ సముద్రం, సుమత్ర తీరప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పిర్ స్థాయివరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో మీ 13వ తేదీ నీ హెల్త్ కేర్ పడే అవకాశం ఉందని, తరువాత 72 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇవాళ(మంగళవారం) భూములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News