ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న అనంతబాబు

Update: 2022-09-23 07:55 GMT

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు మరోసారి రిమాండ్‌ను పొడిగించింది. ఇది వరకు విధించిన రిమాండ్ గడువు ఇవాళ్టితో పూర్తికావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అనంతబాబు రిమాండ్‌ను అక్టోబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో అనంతబాబును పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు కాలయాపన చేస్తున్నారని న్యాయవాది అన్నారు.

Tags:    

Similar News