రైతులకు ఎరువుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి
మండలంలోని గ్రామాలలోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెంకన్న పాళెం, కోడూరు గ్రామాలలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు.
టి.పి.గూడూరు: మండలంలోని గ్రామాలలోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెంకన్న పాళెం, కోడూరు గ్రామాలలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. గ్రామాలలో అశేష జనవాహిని మధ్య ఆయన పర్యటించారు. వెంకన్న పాళెం, కోడూరు గ్రామ సచివాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి. గ్రామాలలోని సమస్యలపై ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కాకాణి.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవసరమైన ఎరువులను ఎమ్మెల్యే కాకాణి పంపిణీ చేశాడు. అంగన్ వాడీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కొరకు అవసరమైన స్టీలు ప్లేట్లు, గ్లాసులను ఎమ్మెల్యే కాకాణి పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు పలు హామీలను ఇచ్చారని, వాటిలో ప్రధానంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా, మీ సమస్యలు మీరు మీ గ్రామంలోనే పరిష్కరించు కోవచ్చు. గతంలో చంద్రబాబు కనీసం కరెంట్ లైన్ మెన్ ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి, సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని సమస్యలు తీరుతాయి.
ప్రతిభ కలిగిన వారికే ఉద్యోగాలు ఇచ్చారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, మత్స్యకారులకు పక్క రాష్ట్రంలో మాదిరిగా భృతి ఇవ్వాలన్న విషయాన్ని, పాదయాత్రలో ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని, దానికి ఆయన స్పందించి ప్రస్తుతం ఎక్కడా ఇవ్వని విధంగా మత్యకారులకు 10 వేలు భృతి ఇస్తున్నారన్నారు. 5 నెలల కాలంలోనే, జగన్ మోహన్ రెడ్డి 90 శాతం వరకు హామీలను నేరవేర్చారు.
మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, చంద్రబాబు ఉనికి కోల్పోతున్నాడు కాబట్టి అప్పుడప్పుడు ఆట విడుపుగా ఆరోపణలు చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న ఒక "బాహుబలి" మాత్రం చంద్రబాబు పర్యటనపై, వ్యతిరేకత రావడంతో పోలీసులపై ఆరోపణలు చేస్తున్నాడు. నేను మీ ఇంటి బిడ్డలాగా, మీకు ఎల్లవేళలా అండగా ఉంటానని, ఏ సమయంలోనైనా, మీ ఇంట్లో వ్యక్తిలా భావించి మీరు నా వద్దకు వచ్చి, సమస్యలు చెప్పుకోవచ్చుఅని ఎమ్మెల్యే తెలిపారు.