MLA Kakani: మాజీ మంత్రి సోమిరెడ్డిపై మండిపడ్డ ఎమ్మెల్యే కాకాణి
MLA Kakani: సోమిరెడ్డి ఆరోపణలపై కాకాణి కౌంటర్ అటాక్ * ఎవరి హయాంలో అవినీతి జరిగిందో..
సోమిరెడ్డి పై మండిపడ్డ ఎమ్మెల్యే కాకాని (ఫోటో ది హన్స్ ఇండియా)
MLA Kakani: మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఏపీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ మరోసారి మండిపడ్డారు. జూమ్ మీడియా కాన్ఫరెన్స్ లో సోమిరెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ అటాక్ ఇచ్చారు. 2014 నుంచి ఇప్పటివరకూ అవినీతి ఎవరి హయాంలో జరిగిందో విచారణ జరిపిద్దామని సవాలు విసిరారు. సిట్టింగ్ జడ్జితో విచారణకైనా ,హై కోర్టులో పిల్ కైనా సిద్ధమని స్పష్టం చేశారు. దమ్ముంటే సోమిరెడ్డి తన సవాలును స్వీకరించాలన్నారు. తన హయాంలో అవినీతి జరిగిందని తేలితే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని తెలిపారు.