MLA Daggupati Prasad: ప్రజలకు బాధ్యతగా పనిచేయడమే తమ మొదటి ప్రాధాన్యత

MLA Daggupati Prasad: గత వైసీపీ పాలనలో టీడీపీ సానుభూతిపరులపై కక్షతో.. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర పథకాలు అందకుండా చేశారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆరోపించారు.

Update: 2026-01-02 12:00 GMT

MLA Daggupati Prasad: గత వైసీపీ పాలనలో టీడీపీ సానుభూతిపరులపై కక్షతో.. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర పథకాలు అందకుండా చేశారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆరోపించారు. అనంతపురంలో టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేతో తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇప్పటి వరకు 7వందల 65అర్జీలు రాగా.. అందులో 6వందల 44 సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. ప్రతి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామని.. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమతో చెప్పవచ్చన్నారు. ప్రజలకు బాధ్యతగా పని చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.

Tags:    

Similar News