Arani Srinivas: త్వరలో తిరుమల స్థానికులకు శుభవార్త.. శ్రీవారి దర్శనానికి అనుమతిపై నిర్ణయం
Tirumala: తిరుమల, తిరుపతి వారికి శ్రీవారి దర్శనాలపై టీటీడీ పాలక మండలి ఏర్పాటు తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.
Arani Srinivasulu: త్వరలో తిరుమల స్థానికులకు శుభవార్త.. శ్రీవారి దర్శనానికి అనుమతిపై నిర్ణయం
Tirumala: తిరుమల, తిరుపతి వారికి శ్రీవారి దర్శనాలపై టీటీడీ పాలక మండలి ఏర్పాటు తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల తర్వాత మొదటి సారి ఆయన తిరుమల స్థానికులతో సమావేశమయ్యారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతో మాట్లాడి గతంలో మాదిరి ప్రతి మంగళవారం రోజున స్థానికులకు దర్శన ఏర్పాట్లు చేస్తామని హామి ఇచ్చారు. శ్రీవాణి, దర్శనాల అవినీతిపై విజిలెన్స్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. తిరుమలలో చిరు దుకాణాదారుల సమస్యలపై ఈవోతో చర్చిస్తానని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు.