Nimmala Ramanaidu: రాజకీయ లబ్దిపొందేందుకే వైసీపీ ప్రయత్నిస్తుంది
Nimmala Ramanaidu: తెలంగాణలో అధికార, విపక్ష నేతల మధ్య వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ విషయాల్లోకి చొప్పించడం ద్వారా రాజకీయ లబ్ధిపొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.
Nimmala Ramanaidu: తెలంగాణలో అధికార, విపక్ష నేతల మధ్య వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ విషయాల్లోకి చొప్పించడం ద్వారా రాజకీయ లబ్ధిపొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వైసీపీ హయంలో ఆమోదం తెలిపారని చెప్పారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులకు వైసీపీ ఐదేళ్ల పాలనలో కేవలం రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎనిమిది వేల కోట్లు సీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టామన్నారు. పుంగనూరు బ్రాంచి కెనాల్ 738 కిలో మీటరు వరకు, మడక శిర కెనాల్ 493 అమరాపురం చెరువు వరకు కృష్ణా జలాల్ని తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదే అన్నారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాత.. చంద్రబాబు హాయంలోనే రాయలసీమ చెరువుల్లో జలకళ సంతరించుకుందన్నారు.