అందుకే అధిక విద్యుత్ బిల్లులు.. మంత్రి బుగ్గన క్లారిటీ

ఏపీలో కరెంట్ బిల్లులు జనాలకు షాకిస్తున్నాయి. దీనిపై ప్రతిపక్ష టీడీపీ సహా బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

Update: 2020-05-15 12:30 GMT
Minister buggana rajendranath reddy(file photo)

ఏపీలో కరెంట్ బిల్లులు జనాలకు షాకిస్తున్నాయి. దీనిపై ప్రతిపక్ష టీడీపీ సహా బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాలు చేసే విమర్శలకు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పారు. మంత్రి బుగ్గన శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. విద్యుల్ శ్లాబుల ధరలు పెరగకపోయినా.. పెరిగినట్లు ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ వల్ల ప్రజలు ఇళ్లలో ఉండటం వల్ల అధికంగా కరెంట్ వినియోగం పెరిగిందని మంత్రి బుగ్గన అన్నారు.

మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విద్యుత్ బిల్లులు ఇవ్వలేదని, ఇప్పుడిస్తున్న బిల్లులు 3 నెలల సగటు యూనిట్లు లెక్కేసి ఇస్తున్నట్లు వెల్లడించారు. మూడు నెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడంతో ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందని చెప్పారు. జూన్ 30వ తేదీ వరకు బిల్లులు చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో కరెంట్ బిల్లులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీటర్ రీడింగ్ రెండు నెలలు తీయక పోవడంతోనే టారిఫ్ శ్లాబ్ మారడంతో కరెంట్ బిల్లులు పెరిగాయన్నారు.

2014లో యూనిట్ 4.33 పైసలకు కొనుగోలు చేస్తే టీడీపీ హయాంలో యూనిట్ 6 రూపాయిలకు పెంచిందని మంత్రి బుగ్గన వెల్లడించారు. తమ పార్టీ అధికరంలోకి రాగానే 5.16 పైసలుకు యూనిట్ తగ్గించామని తెలిపారు. పవర్ పర్చేజ్‌ బకాయిలు 2014లో రూ. 4,900 కోట్లు ఉంటే.. 2019 నాటికి రూ. 20 వేల కోట్లకు చేర్చారని మంత్రి ఆరోపించారు.To 

Tags:    

Similar News