ప్రజల ప్రాణాల‌కంటే ఏదీ ఎక్కువ కాదు.. అవసరమైతే కంపెనీ తరలింపు.. మంత్రి బొత్స

విశాఖ విషవాయువు లీకేజ్ దుర్ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.

Update: 2020-05-11 04:31 GMT
Minister Botsa Satyanarayana(File photo)

విశాఖ విషవాయువు లీకేజ్ దుర్ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యం పూర్తి వైఫల్యమే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పడానికి వీలు లేదని మంత్రి అన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ కమిటీ వేశారని కమిటీ నివేదిక అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైతే కంపెనీని జనావాసాలకు దూరంగా తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు.

ప్రజల ప్రాణాల కంటే తనకు ఏది ఎక్కువ కాదని బొత్స అన్నారు. ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా గ్రామాల్లో పూర్తిగా కెమికల్ శుద్ధి చేసిన తర్వాతే ప్రజలను‌ ఇళ్లలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు మాదిరి అసత్యాలు మాట్లాడమని బొత్స అన్నారు. టిడిపి డ్రామా కంపెనీ విమర్శించారు.

Tags:    

Similar News