అఖిల భారత డ్వాక్రా బజార్‌ను ప్రారంభించిన మంత్రి బొత్స
Botsa Satyanarayana: డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ఆదరించాలి
అఖిల భారత డ్వాక్రా బజార్‌ను ప్రారంభించిన మంత్రి బొత్స
Botsa Satyanarayana: డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ఆదరించి ప్రోత్సహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. విజయనగరంలోని దిగువ ట్యాంక్‌బండ్ రోడ్డులో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్‌ను మంత్రి బొత్స ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 250కి పైగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటవుతున్నాయని ఆయన చెప్పారు. మహిళలకు అవసరమైన వస్త్రాలు, హస్తకళాకృతులు, తినుబండారాలు, గృహాలంకరణ వస్తువులు సహా ఎన్నో రకాల వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయని, నగర, జిల్లా ప్రజలు దీనిని వినియోగించుకోవాలని బొత్స సత్యనారాయణ కోరారు.